పాపము అంటనిది నిష్పాపా.
లోకములో పాపా పుణ్యములు రెండు రీతిగా వుండును.
అహింస , సత్యం, శాంతి, దానము, త్యాగము ఇవన్నియు పుణ్య కర్మములు.
అసత్యం, హింస, మోసము, ద్రోహము, హత్య ఇవన్నియు పాపా కర్మములు. ఈ లక్షణాలు పాపా పుణ్యాలను సూచిస్తాయి.
మన జీవన విధానం లో నిత్యం పాటించవలసిన సూక్తి ఏమిఅనాగా "పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమ"
ఇతరులకు పరోపకారము చేయడం, మన నిజజీవితంలో భాగం గా వుండాలి.
అప్పుడే ఆ పరాభట్టారికా దేవి ప్రీతిచెందుతుంది . అంటే పరులకు ఉపకారం చేస్తే పుణ్యం, పరులను పీడిస్తే, బాధ పెడితే పాపము.
ఇతరులను బాధ పెట్టకుండా, శాంతియుతంగా సహజీవనం చేయటం అనేది మన సంస్కృతి రక్తంలో ఉన్నది. ఆ సంస్కృతిని మనము పాటిస్తే, జీవుడు నిష్పాపా అయి జాగ్తజ్జననికి ప్రీతిపాత్రులవుతారు .
పాపరహితురాలైన ఆ తల్లికి నమస్కారము 🙏
🌺ప్రతి పని చేసేముందు ఇది ధర్మబధమేనా,.. కాదా,.. అన్న ఆలోచన చేసే వివేకం కలిగి, ధర్మ మార్గంలో నడిచే సత్బుధి, సత్ప్రవర్తన కలుగుతుంది. 🌺
|