శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
102. విష్ణుగ్రంధి విభేధిని | ||
ఇదియే అనాహతము. వాయుతత్వము. సర్వతన్మాత్ర విశిష్టతము. అనగా ఏవిధమైన తాకుడు లేకుండా అంటే అవయములు యుక్క ప్రయత్నం ఏమియూ లేకుండా నాదము ఉదయించు ప్రదేశము.. అనాహతములో అహ్మస్వరూపడైన జీవుని చోటు. అహం అన్నదే జీవచాపల్య లక్షణమైన మాయ. కావున జీవరూపంలో పరదేవత ఇచ్చట విష్ణుమాయావిలాసినియై, వైష్ణవియై వుంటుంది. అనాహత నాదము పుట్టుటయే విష్ణుగ్రంధి విభేదము. అంటే జీవుడికి స్థూలము వలే సూక్ష్మము కూడా అనిత్యమనే జ్ఞ్యానము కలిగించడం అని అర్ధం. మణిపూర చక్రానికి పైన ఉన్న విష్ణుగ్రంధిని భేదించి ప్రకాశించు తల్లికి నమస్కారము 🙏 🌺మనస్సు చెడుని దూషించకుండా, ఉద్రేకాలకు లొంగకుండా, మంచిని, సహనాన్ని అలవాటు చేస్తుంది🌺 |