శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
122. శాంభవి | ||
భవాని, భువనేశ్వరి, చాముండ - ఈ నామములన్నియూ శుభములనిచ్చునవి. ఈ నామమునుండి పది నామములు శాంభవీ విద్యగా పరిగణించబడతాయి. అందులో మొదటి నామమే శాంభవీ. "అంతర్లక్ష్యం బహిర్ దృష్టి: నిమిషాన్మేష వర్జితా ఏషా సా శాంభవీముద్ర సర్వతంత్రేషు గోపితా ". అంతర్లక్ష్యం అంటే మొదట దాహారంలో జ్యోతి ఉన్నట్లు భావన చెయవలెను. పిదప ఆజ్ఞలో జ్యోతి వున్నట్లు భావన చేయవలెను. ఆ తరవాత సహస్రారములో చిత్కళ ధ్యానం. ఇది అంతర్లక్ష్యం లో పరమార్ధం. "బహిర్ ద్రుష్టి " అంటే పూర్ణిమదృష్టితో కనిపించనంతవరకు చూడవలెను. ఏకాగ్రతకోసం పెట్టుకున్న చుక్క జ్యోతిగా మారేవరకు బహిర్ ద్రుష్టి అని అర్ధం. అప్పుడు అంతర్జ్యోతి, బహిర్ జ్యోతి ఏకమవుతాయి. రెండు కలిసి సర్వతొంజ్యోతి అవుతాయి. అదే చిత్కళ ధ్యానం. అదే శాంభవీ విద్య. శంభుని పత్ని కాబట్టి ఆమెకు శాంభవీ అనే నామముతో పిలవబడుతుంది.ఎనిమిది సంవత్సరాలు బాలికను కూడా శాంభవీ అంటారు. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺అమ్మాయెందు ఏకాగ్రత పెడితే, ఓర్పు, శాంతస్వభావం కలుగుతాయి. 🌺 |