శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
178. నిర్భేదా | ||
మానవుడి భౌతిక జీవనంలో, మాయా, వివిధకారములను ధరించి, భేద భావం తో ఒక మనిషినించి ఇంకొక మనిషిని బాధ పెడుతూవుంటుంది. భేదము వలన దుఃఖము వస్తుంది. ఆ దుఃఖము మనలో ఊర్ధ్వప్రాణముచేత తొలగించబడుతుంది. ఉదానమార్గమున ప్రయాణం చేసేదే ఊర్ధ్వప్రాణము, అదే నిర్భేద. భేదములు లేనటువంటిదే నిర్భేదా. భేదరహితురాలైన తల్లికి నమస్కారము 🙏 🌺నావాళ్లు, పరాయివాళ్ళు అనే భిన్నతత్వం మనలో ప్రవేశించకుండా కాపాడుతుంది.🌺 |