శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
173. సంశయఘ్నీ | ||
సంశయమును పోగొట్టునది. ద్వైత భావం నశించడం వల్ల, మనసులో విశ్వాసం తప్ప వేరే సంశయము వుండదు. తన భక్తుల సంశయాలను తొలగిపోయేటట్టు పరిస్థితులను కల్పిస్తుంది ఆ తల్లీ. ఆ పరమేశ్వరి మీద పరం విశ్వాసం వుండటమే సంశయఘ్నీ. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఎటువంటి పరిస్థితులులైన, ఆ పరాత్పరి మనకు మనో ధైర్యాన్ని ఇస్తుంది. సంశయాలను తోలగిస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది 🌺 |