శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
142. నిష్కామా | ||
*"సంపూర్ణ కామస్య కిమిత్యేతి".* అన్నియూ తనయందే వున్నపుడు, తనకు లోపము లేనప్పుడు, తాను వాంచించవలసిన బయటి పదార్థము ఏదియు లేనప్పుడు దానిని నిష్కామ అంటారు. అమ్మవారి విశ్వగర్భమునందే 84 లక్షల జీవరాశులు, అనంతకోటి జడములు, స్థావరములు ఎన్నియో పుట్టినవి. అట్టి సర్వ దృశ్యమునకు, సర్వ నామ రూపములకు, సర్వ జగదధిష్టాత్రియైన పరమేశ్వరి కి కోర్కెతో అవసరము లేదు కాబట్టి ఆమె నిష్కామ. కోర్కెలకు అతీతముగా వున్న తల్లికి నమస్కారము 🙏 🌺కార్యాచరణములో స్వార్ధ పూరిత భావాలు కలగకుండా గమ్యం చేరేవరకు నిష్కామంగా చేయగలుగుతాము, దానివల్ల మధ్య మధ్యలో దారి తప్పే ప్రమాదం జరగదు 🌺 |