శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
131. శాంతిమతీ | ||
శాంతిస్వరూపము అని అర్ధం. శ్రీవిద్యలో శాంతి అంటే అక్షరపరబ్రహ్మము 'ఓం' అన్న శాంతి అన్న 'తత్' అన్న సత్ అన్న ఆ పరబ్రహ్మమునకే గుర్తు. ఓంలకు అతీతమైన పరానాదస్వరూపిణిగా బ్రహ్మశీర్షాన్ని చేరుతుంది. ఈ నామము పంచ్ జ్యోతులు కి సంకేతము చేయబడుతుంది. 1.మూలాధార కుండలినీ జాగృతం అవుతుంది. ఇది ఒక జ్యోతి 2.మణిపురంలో సుషుమ్నగా ప్రస్థానం చేస్తుంది అదొక జ్యోతి. 3. అనాహతములో ప్రత్యగాత్మ ప్రాభవంగా పరిఢవిల్లుతుంది అదొక జ్యోతి 4. ఆజ్ఞాచక్రంలో ఆత్మజ్యోతి దర్శనంగా కనీవుఇస్తుంది అదొక జ్యోతి 5. సహస్రారంలో బ్రహ్మజ్యోతి 'ఏక' అవ్వటం. శాంతిమతీ అన్న నామము, శాంభవీ విద్యలో పదవ మెట్టు, ఈ పంచ్ జ్యోతిస్థానాలు కలిస్తే పంచదశీ మంత్రమవుతుంది. ఆ పంచదశీ మంత్ర బీజానికి అధిష్టాత్రి ఐన ఆ తల్లికి నమస్కారము 🙏 🌺జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, గాంభీర్యం మొదలైనవి కలిగి వున్న వ్యక్తి శాంతికి మారుపేరుగా వుంటాడు. అటువంటి వారు వున్న చోట ప్రకృతి కూడా ప్రశాంతంగా వుంటుంది. 🌺 |