శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
177. నిరాబాధా | ||
నిరాబాధా అనగా, ఏ విధమైనటువంటి భాదలచే భాదించబడనిది. బాధా రహితము అని అర్ధం. మనిషికి మనస్సు వల్ల బాధ కలుగుతుంది. మనస్సు తో చేసిన సంకల్పం ద్వారా సుఖము, దుఃఖము కలుగుతాయి. సంకల్పము కోర్కె వలన బాధించబడుతుంది. కోర్కె ద్వంద ఆలోచన, మాయ చే భాదించబడుతుంది. సంకల్పము అనేది ధర్మ భదంగా వుంటే, దేవుడు ఆ సంకల్పాన్ని నిర్వర్తిస్తాడు. మనస్సు ఎల్లపుడు ధర్మ మార్గములోనే వుండేటట్టుగా ప్రతి మనిషి ఆ పరాత్పరీని ప్రార్ధించాలి. లలితా పరమేశ్వరి వీటికి అతీతమైనది. ఆనందస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము 🙏 🌺 ఎదురుదెబ్బలు, భయము, మనని భాదించకుండా నిరాశ పడకుండా వుండే స్వభావము ఏర్పడుతుంది. 🌺 |