శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
170. నిర్లోభా | ||
లోభము లేనటువంటిది. ఇందులో 'భ' అన్న అక్షరం తేజస్సుకి సంకేతం. తేజస్సు కే తేజస్సు. తనతో తాను పోల్చుకోవటమే గాని ఆ పరాత్పరి తేజస్సును మరొకదానితో పోల్చుటకు వీలులేదు. అటువంటి తేజస్సు గల తల్లికి దేనియందు ఆశ లేదు. ఆసక్తి లేదు. సదా నిర్లోభా గా వుంటుంది. ఇది నాకే కావాలి, నాకే చెందాలి, ఇంకొకరికి చెందకూడదు అన్న భవము లోభము. ఆ వస్తువు తన కన్నా ఇంకొకరికి ఉపయోగ పడుతుంది అన్న ఆలోచన తో సదా ప్రతిఫలాపేక్ష లేకుండా, నిర్లోభా గా వుండగలగాలి. ప్రపంచోల్లాసలోభము కూడా లేని పరా లలితపరమేశ్వరికి నమస్కారము 🙏. 🌺లోభము వుండినంత వరకునూ మానవుడు సుఖమును అనుభవించలేడు. లోభం వల్ల తను సుఖపడలేడు, ఇతరులను సుఖపడనీయడు. నీవు తింటే మట్టి పాలు, నీవు ఇతరులకు ఇచ్చినది నీపాలు అని పెద్దలు చెపుతారు. మనము ఇతరులకు ఇచ్చినదే మన వెంటవస్తుంది. మనము తింటే కొద్దిసేపటికి అరిగిపోతుంది. ఆ పరాత్పరి అనుగ్రహం మనయందు వుండాలి అంటే "పరోపకారాయ ఇదం శరీరం" అనగా దేవుడు ఇంచిన ఈ శరీరముతో అందరికి సాధ్యమైనంతవరుకు ఉపకారం చెయ్యాలి. అన్న భావన ప్రతి వొక్కరిలోను వుండాలి. అప్పుడే లోభము అన్న బలహీనతను జయించగలము 🌺 |