శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
172. నిస్సంశయా | ||
సంశయములు లేనటువంటిది. మహా మాయా స్వరూపిణి నిస్సంశయా. అనేక రూపముగా అవతారం దాల్చినప్పటికీని, పరి పూర్ణరూపముగా ఆ లలితా పరమేశ్వరి రూపములో ప్రతిఫలము ఇచ్చునది. ఎట్టి సంశయములకు ఆమె యందు తావు లేదు. సర్వసంశయములకు మూలములను ఆమె ఎరుగును. ఈ బ్రహ్మాండము నందు పరబ్రహ్మ స్వరూపముగా శ్రీమాత సంశయరహితురాలు. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺స్వచ్చమైన మనసుతో, నిర్దిష్టమైన సంకల్పంతో అమ్మ యందు విశ్వవాసం తో, ఏ సంశయానికి, భయానికి, అనుమానాలకి తావు వుండదు 🌺 |