శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
164. నిర్మమా | ||
మమకారము లేనటువంటిది. అకుల మార్గము లో సుషుమ్న ప్రస్తానినించినప్పుడు, పూర్ణ తత్వం ఏర్పడి, మమతా, రాగ, ద్వేషాలకు అతీతముగా వుండును. అదియే నిర్మమా. ఈ బ్రహ్మాండము నందు, సకలము తానై వున్నా, దేవికి వాటియందు మమకారము ఉండజాలదు. ఆ దేవికి 'నేను' అనే అహంకారము లేని కారణముచేత, 'నాది' అనే మమకారము కూడా వుండదు. మమకారం రహిత అయిన ఆ తల్లికి నమస్కారము 🙏 🌺 నాది, నేను, నాకోసం, వంటి మమకారంతో కూడిన బలహీనత మనలో ప్రవేశించకుండా, వాటి వల్ల ఏటువంటి అడ్డంకులు కలగకుండా కాపాడుకోగలుగుతాము 🌺 |