శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
116. భద్రమూర్తి | ||
సహస్రారమే భద్ర పీఠము. అచ్చట శ్రీరాజరాజేశ్వరీ భద్రమూర్తి. స్థూలము విరాట స్వరూపము. సూక్ష్మ దేహము హిరణ్యగర్భ. కారణ శరీరము ఈశ్వరము. వీటి సమాహారము భద్రమూర్తి. ద్వైతమే భయము. అద్వైతమే అభయము. ఆ అభయ లక్షణమే భద్రమూర్తి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺కార్యాచరణములో ఎటువంటి విరుద్ధభావాలు, అడ్డంకులు రాకుండా, మనకి అభయము ఇస్తూ, రక్షణ కలిగిస్తుంది 🌺 |