శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
162. నిర్మోహ | ||
దేహము పట్ల భ్రాంతియే మోహము. లోక స్వరూపిణి ఆ జగన్మాత. ఈ సమస్త లోకాన్నీ, అందులో ప్రాణులను సృష్టించింది. ఐనను తను సృష్టించిన దానిమీద ఎటువంటి మోహము లేదు ,చిత్త విభ్రాంతిని పొందదు. ఇది నాది, ఇది నాకు కావలెను, ఇది లేకపోతే నేను జీవించలేను అన్నది మోహము. అహం వున్నంతవరకు మొహం వుంటుంది. అహం నశిస్తే, మోహము కూడా నశిస్తుంది. అప్పుడు మొహానికి తావు లేదు. "చిదానంద స్వరూపం శివోహం శివోహం " అంతా మనమంచికే అన్న భావన కలిగి, నిత్యం చిదానంద స్వరూపము గా వుంటాడు జీవుడు. అట్టి మోహభ్రాంతి లేనటువంటిది పరామాత. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺నాది-నిది, మన -పర, అన్న భేదములు, వ్యామోహాలు మన మనస్సును కలుషితం చేస్తాయి. మన దేహము కలుషితంగా వున్నపుడు, భగవంతుడు ప్రీతి చెందడం అసాధ్యం. ఈ నామ స్మరణ వల్ల, మన గమ్యం చేరేలోపల ఎటువంటి వ్యామోహాలకు లోబడకుండా జాగ్రత్త పడగలుగుతాము 🌺 |