శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
188. దుర్లభా | ||
అమ్మవారి అనుగ్రహం పొందడం సులువుగా లభించదు. నిర్వికార రూపమైనటువంటి ఆ దేవి అనుగ్రహం పొందడం యోగులకు సైతం దుర్లభం అని ఈ నామము యుక్క అర్ధము. అమ్మవారియుక్క సాక్షాత్కారము లభించడానికి, మన సమస్యలను ధైరంతో, ఓపికతో ఎదురుకోవాలి. అమ్మవారి పాదాలను గట్టిగ పట్టుకొని "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ " నువ్వే నన్ను ఈ సమస్యనుంచి బైట పడేయాలి అని స్వచ్చమైన మనస్సుతో వెడొకోవాలి. అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది. 🌺నిజాయితీగా వుండి, మన కర్తవ్యాన్ని పూర్తి చేసుకోగలము 🌺 |