శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
117. భక్త సౌభాగ్యదాయినీ | ||
*దాయినీ :* ప్రసాదించేది. *సౌభాగ్యదాయిని* : భాగ్యమును ఇచ్చేది. సౌభాగ్యము రెండు విధములు. 1)జగత్తు ఐశ్వర్యము, 2)ఈశ్వరభావన లక్షణము. ఈ రెండు ఇచ్చేది ఆ సౌభాగ్యదాయిని. *భక్త* : ఆమె ఈశ్వరునియందు ఎప్పుడు అనురక్త కాబట్టి ఆమె భక్త. ఆ లక్షణమే ఆమె యందు మనం చూపించినప్పుడు మనము కూడా భక్తులమే అవుతాము. భక్తుల చతుర్విధ పురుషార్ధములను ఆమె ఇస్తుంది. చివరకు నిర్వాణపధమైన పంచదశి కూడా ఇస్తుంది. భక్తులకు సౌభాగ్యాములను ప్రసాదించు తల్లికి నమస్కారము 🙏 🌺మంగళకరమైన ఆలోచన విధానము ఆలపడుతుంది. ఆ అమ్మ యందు అనురక్త భావన తో వుంటే, ఆ తల్లీ మనకి సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది🌺 |