శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
167. పాపనాశినీ | ||
పాపము నశింపచేయుతల్లీ అని అర్ధము. ద్వైత బుద్ధియే పాపమునకు దారితీస్తుంది. నేను, ఇతరము అను ద్వైత బుద్ధి యున్నంత కాలము జీవుడు అజ్ఞానము లో వుంటాడు. ఇతరుల రూపమున ఉన్నది కూడ నేనే అను భావము అద్వైత బుద్ధి. అపుడే ప్రేమ అవగాహన కలుగుతుంది. అందరి లోనున్నదీ శివ శక్తులే. శివము, సత్యము, శక్తి, చైతన్యము. వీని నుండి పుట్టినవాడే జీవుడు. అందరి మూలము ఒకటే. కావున జీవ లందరూ, ఒకే ఉదరము నుండి పుట్టినవారమని తెలుసుకోవాలి. అట్టి జ్ఞానము కలగనంత కాలము మోహ వుంటుంది. సృష్టియందు మోహము సహజము. మోహము వలన దుఃఖము తప్పనిసరి యగును. దుఃఖమువలన జీవుడు విచారములో పడుతాడు. దుఃఖమును దాటుటకు ప్రయత్నించాలి . కానీ ద్వైత ಬುದ್ಧಿ యున్నంత కాలము దుఃఖము వుంటుంది. శ్రీమాతను భక్తి శ్రధలతో ఆరాధించిన వారిని శ్రీమాతయే ఉద్ధరించ్చి, క్రమముగా జ్ఞానోదయము కలిగిస్తుంది. పాపములను నాశనము చేస్తుంది. ఆ శ్రీమాత యుక్క నామములు నిష్కల్మష మనస్సు తో జపిస్తే, సర్వ పాపమును హరించి, మోక్షమును ప్రసాదిస్తుంది. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺పాపములతో కూడిన ఆలోచనలు, కార్యాలు చేయవలసిన అవసరం లేకుండా కాపాడబడుతాము 🌺 |