శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
119. భక్తి గమ్యా | ||
భక్తి చేత చేరగలిగింది. భక్తి అంటే భారతి, వెలుగు. వెలుగు ద్వారానే పరంజ్యోతిని చేరగలము. మనలోపల వెలుగు సుషుమ్న. భక్తి అంటే అంతర్యాగములో సర్వాత్మభావన. బహిర్యాగములో నవవీధి భక్తులు. ఈ రకంగా భక్తి అనేది అనేక మార్గములో వున్నపటికిన్నీ, ఏ మార్గముచేత మానవుడు తనను చేరటానికి ప్రయత్నించినా ఆ తల్లీ సంతోషిస్తుంది. ఇది నిష్కల్మషమైన భక్తి ద్వారా నే సాధ్యం. 🙏 🌺భక్తితో కూడిన ఇష్టం, భక్తికి సంబందించిన గమ్యం వైపే నడకను సాగిస్తుంది 🌺. |