శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
865. క్షయ వినిర్ముక్తా | ||
అంతము లేనటువంటిది. పరమేశ్వరి జగత్తు కంటే అతీతము. ప్రళయము సమీపించినా, తనకు అంతము లేదు కనుక, పరమేశ్వరి క్షయము కానిది. మహామాయా స్వరూపమైన పరమేశ్వరి క్షయము కానిది కనుక క్షయ వినిర్ముక్తా. జనన మరణముల నుండి ముక్తిని పొందిన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 జనన మరణములు అన్నవి, చేసిన కర్మలను బట్టి, మనకి ఉత్కృష్టమైన జన్మ లభిస్తుంది అన్న ప్రక్రియను ప్రగాఢముగా నమ్ముతాము. అందుకు తగు జాగ్రత్త పడతాము 🌺 |