శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
812. పరమంత్రవిభేధినీ | ||
క్షుద్ర మంత్రములను భేదించునది పరులకు అపకారము తలుపుటకు చేసే క్షుద్ర పూజను విభేదించునది. దుష్టమైన మంత్రముతో పిడితులైనవారు, పరమేశ్వరి శరణు వెడగా, వారికి రక్షణ కలిగిస్తుంది. దుష్ట శక్తి మంత్రమును భేదించు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺లలితా సహస్ర నామ మంత్రమును నిత్యము స్మరణ చేయగా, భక్తులకు దుష్ట శక్తి ప్రభావము పడకుండా, పరాశక్తి రక్షణా కవచమును ఏర్పాటు చేసి రక్షిస్తుంది 🌺 |