శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
814. అమూర్తా | ||
రూప రహితము నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపము. బ్రహ్మం అంటే జ్ఞానులు ఉపాసించే నిర్గుణ నిరాకార తత్త్వము. దేహములో నివసించి ఉంటున్న 'పరమాత్మ' రూపము. ఇంద్రియములతో లేక మనసుతో అందేది మూర్తము. అలా అందనిది అమూర్తము. పరమేశ్వరియొక్క తత్వము అమూర్తము🙏 🌺మంత్ర సాధన చేత మనసు పవిత్రత చెందుతుంది. పరమాత్మ తత్వము అగుపడుతుంది 🌺 |