శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
815. అనిత్యతృప్తా | ||
అనంత తృప్తి కలిగి వున్నది బ్రహ్మానంద స్థితిని పొందినది కనుక పరమేశ్వరి నిరంతరము అనంతమైన తృప్తి తో నిండి వున్నది. అనిత్యతృప్తా అంటే ఎప్పుడూ తృప్తి లేనిది అని కాదు. నిరంతరము అత్యంత తృప్తిని పొందునది అని అర్ధం. త్రికరణ శుద్ధితో పూజించిన యెడల పరమేశ్వరి "భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమోనమః "అన్న రీతిగా,తృప్తి చెందుతుంది. నిరంతరము భక్తుల ఆరాధనతో తృప్తి చెందే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ఫలము, పుష్పము, పత్రము ఏదైనా సరే, ఇది ఖరీదైన వస్తువా, లేక చవక వస్తువా అన్నది చూడకుండా కేవలం భక్తి ప్రాధాన్యత తో సమర్పించిన ఆరాధనకు అమితముగా తృప్తి చెందుతుంది, కరుణిస్తుంది . కుచేలుని భక్తి ఆదర్శముగా తీసుకోవాలి 🌺 |