శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
840. భవరోగఘ్నీ | ||
భవ రోగములను అగ్నిలో దహించునది భవము అంటే సంసారము. నేను నాది అనే అహంకార మమకారాలు. మొదట్లో అవి తీపిగా అనిపిస్తాయి. అందుకనే మనుషులు వాటిలో చిక్కుకొని, వాటి నుండి విముక్తి పొందలేరు. పరమేశ్వరిని శరణు వేడగా, ఈ భవ రోగముల నుండి విముక్తి కలిగించి, మరల వాటి వ్యామోహము కలిగినప్పుడు అగ్ని లో దహించునది🙏 🌺మనిషి ముక్తిని పొందాలి అంటే గృహస్తుకే సాధ్యము. సుఖము దుఃఖము ఏది వచ్చిన,అంత మన మంచికే అన్న దృఢ భావము అలవాటు చేసుకుంటాము🌺 |