శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
806. పరంజ్యోతిః | ||
ఆత్మ జ్యోతి పరమాత్మ స్వరూపమే ఆత్మజ్యోతి. అజ్ఞానము తొలగి పరమాత్మ ను జ్యోతి రూపములో దర్శించడమే పరంజ్యోతి. హృదయాంతరాళమున జ్ఞాన నేత్రములతో చూడగలిగిన జ్యోతి స్వరూపానికి నమస్కారము 🙏 🌺ప్రతి ఇంటా దీపము వెలిగిస్తూ, "దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్ధన, దీపేన హరతే పాపం, దీప రాజా నమోస్తుతే." అని ధ్యాన శ్లోకం చదివితే, దీపము కలిగిన ఇంట, శ్రీలక్ష్మి ఉండి పాపములను పారద్రోలి, ధనము,ఆరోగ్యం, శాంతినిచ్చి, భక్తులను కాపాడుతుంది🌺 |