శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
852. గంభీరా | ||
గంభీరమైన తత్వము కలిగి వున్నది. పరాశక్తి యొక్క తత్వమును తెలుసుకొనుట చాలా కష్టము. సముద్రములో అలలు ఆందోళన కలిగించినా, విశాలతత్వము చేత గంభీరముగా అగుపడుతుంది. అటులనే, మనిషికి మంచి జరిగినా, చెడు జరిగినా, ఒకే తీరుగా అంతా పరమేశ్వరి యొక్క ప్రసాదము అని స్వీకరించడము వల్ల, వారిలో పరమేశ్వరి యొక్క గంభీర తత్వమును తెలుపుతుంది 🙏 🌺ధ్యాన సాధన ద్వారానే, ఆ పరమేశ్వరి యొక్క గంభీర తత్వమును తెలుసుకొనగలము. అంతా మన మంచికే జరిగింది అన్న స్వభావము అలవాటు చేసుకుందాము 🌺 |