శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
880. యజ్ఞకర్త్రి | ||
యజ్ఞమునకు కర్త్రి. మనలో వున్న శక్తి, పరమేశ్వరి ఇచ్చినదే, మనము నిమిత్త మాత్రులం అన్న భావన మనలో ఉన్నపుడు, జ్ఞానజ్యోతిగా మనలో సంకల్పము కలిగించి, యజ్ఞము చేయు కర్త్రిగా ఉంటుంది . మనతో సుకర్మలను చేయించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 ఈ దేహము పరమేశ్వరి ఇచ్చినది. మనము చేసే ప్రతి కర్మ, పరమేశ్వరి యొక్క కృప ద్వారా నే జరుగుతోంది అన్న భావన సర్వదా శ్రేయస్కరము 🌺 |