శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
817. సత్యవ్రతా | ||
నిరంతరము సత్య వ్రతమును పాటిస్తుంది సత్యము, బ్రహ్మా స్వరూపము. సర్వకాల,సర్వావస్థల యందు సత్యమును ఆచరిస్తుంది. సత్య, జ్ఞాన, అనంత బ్రహ్మా రూపమైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺సత్య, ధర్మములను ఆచరించే ప్రతి మనిషికి, మొదట్లో కొన్ని కష్టాలు ఎదురైనా, ఆఖరకు గెలిచేది సత్యమే. శాశ్వత బ్రహ్మలోకము ప్రాప్తిస్తుంది🌺 |