శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
869. బహిర్ముఖసుదుర్లభా | ||
ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది. ప్రాపంచిక విషయాలపైనే దృష్టి వున్న వారికి పరమేశ్వరి యొక్క సాక్షాత్కారము కలగడము కష్టము. ఇహము నందు కలిగిన విషయాలు అన్నీ మాయా కల్పితములు. అందునా, వాటి యందు ఆసక్తి కలిగిన వారికి తన సాక్షాత్కారము దుర్లభము. 🙏 🌺 మాయా, వాంఛల నుండి ముక్తిని పొందడానికి తగిన మార్గ నిర్దేశము ఆ తల్లి ధ్యానం వలన కలుగుతుంది 🌺 |