శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
843. శాస్త్రసారా | ||
విజ్ఞాన రూపిణీ శాస్త్రము వేదమునకు సంబంధించినది. జగత్తుకు కారణమైన పరమేశ్వరిని తెలుసుకొనుటయే జ్ఞానము. శాస్త్రము, జ్ఞానము విజ్ఞాన రూపములు. శాస్త్రములన్నీ, అవి ఆయుర్వేద శాస్త్రము గానీ, నీతి శాస్త్రముగానీ సర్వము పరమేశ్వరి యొక్క రూపములే🙏 🌺 శాస్త్రములలో మర్మమును తెలుసుకోడానికి ప్రయత్నించాలి🌺 |