శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
870. త్రయీ | ||
త్రివేద స్వరూపిణీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు , మరియు , ముగ్గురమ్మలు త్రయీ రూపములు. త్రయీ రూపములో వేదములు ఋగ్వేద, యజుర్వేద, సామవేదము . మూడు అంకెకు సంకేతముగా త్రయీ రూపములు , పరమేశ్వరి నుండి ఉద్భవించినవి అని చెప్పుట ఈ నామము యొక్క విశిష్టత . త్రయీ రూపములో ప్రకాశిస్తున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 త్రికాల సంధ్యావందనము , సృష్టికి శుభప్రదం 🌺 |