శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
807. పరంధామా | ||
" పరము "ను ధరించినది ధామము అనగా అవస్థ . ఈ సృష్టి లో సర్వావస్థలకు అతీతమైన స్థితి ఈ పరం అవస్థ. పరం అవస్థ ను పొందినవాడు తిరిగి మరల జన్మము ఎత్తలేడు కనుక అవస్థా రహిత స్వరూపమే "పరం" . అవస్థారహితమైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺భారతదేశం నలువైపులా ఉన్న నాలుగు ముఖ్య తీర్ధ స్థలాలు బద్రీనాధ్, రామేశ్వరం, జగన్నాధపురం, ద్వారకలను నాలుగుధామములను తప్పకుండా దర్శిస్తే ,ఈ జన్మము తరిస్తుంది🌺 |