శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
854. గర్వితా | ||
అహం బ్రహ్మాస్మి అన్న స్థితి కలిగి వున్నది. నేను వేరు, బ్రహ్మ వేరు కాదు. అహం బ్రహ్మాస్మి అన్న భావనతో వున్నది. అజ్ఞానమును తొలగించే మహా మాయా స్వరూపము, గర్వితా గా స్తుతించబడు శ్రీ రాజరాజేశ్వరి దేవికి నమస్కారము 🙏 🌺 అంచలు అంచలుగా చేరుకున్న మన అభివృధ్ది, సమాజములో గౌరవాన్ని పెంచుతుంది 🌺 |