శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
811. పాశహంత్రీ | ||
పాశ విముక్తి పాశములు అజ్ఞానమునకు గుర్తు. పాశ విమోచనము చేయు శక్తి పరమేశ్వరి యందే వుండును. మాయా సంసారము నుండి ముక్తిని ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మానవ జీవితము అనుభవాలతో నిండి వుంటుంది. మంచి, చెడు, పేరు ప్రఖ్యాతి, కీర్తి,ఆపకీర్తి అన్ని పరమేశ్వరి యొక్క లీలలు అని తెలుసుకోవాలి. మంచి జరిగినప్పుడు నా అంతటి వారు లేరు అని పొంగి పోయి, అపకీర్తి సంభవించినప్పుడు క్రుంగిపో కూడదు. అంతా పరమేశ్వరార్పణమస్తు🌺 |