శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
871. త్రివర్గనిలయా | ||
త్రివర్గ స్వరూపిణి సృష్టి, స్థితి,లయ కారిణి. త్రివర్గ రూపిణి. భూత, భవిష్యత్, వర్తమాన కాలములు త్రివర్గములే. ధర్మ, అర్ధ కామములయందు మహా మాయా స్వరూపిణిగా వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపములో వున్న సంధ్యా దేవతను ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించమని వేడుకుందాము🌺 |