శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
850. సర్వోపనిషదుద్ఘుష్టా | ||
రహస్య రూపిణీ అన్ని ఉపనిషత్తులు పరమేశ్వరి స్వరూపాలే సర్వ ఉపనిషత్తుల యందు పరమేశ్వరి తత్వములు నిఘుడముగా చెప్పబడి వున్నాయి. రహస్య స్వరూపిణి యైన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 పరమేశ్వరి యొక్క నామ మంత్రము, భావము తెలుసుకొని ధ్యానించడం వల్ల మంత్రము సిద్ధిస్తుంది 🌺 |