శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
885. విప్రప్రియా | ||
వేదము చదివినవారు అంటే ఆ తల్లి కి ప్రీతి. బ్రాహ్మణులు వేద విద్యను పొందగలిగిన అర్హత ఉన్నవారు. వారిని విప్రులు అందురు. వేద శాస్త్రములు, వేద కర్మలను ఆచరించే విప్రులలో ఉన్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 త్రికాల సంధ్యావందనము చేయటము, సదాచారము అనుసరించుట అన్నవి శాస్త్రాలలో చెప్పినవే. వాటిని పాటించటము మనకి రక్ష 🌺 |