శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
863. లీలావిగ్రహ ధారిణీ | ||
సృష్టి లీలలను జరిపించునది పరమేశ్వరి యొక్క అవతారములు అనేకం. ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ కొరకుదాల్చిన అవతారములు లీలావిగ్రహ ధారిణీ అని ఈ నామము యొక్క విశ్లేషణ. ఈశ్వరుడి లీలలు సాఫల్యం చేయు పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 నమ్మిన వారికి, జగన్మాత, తన లీలలను అపారముగా కురిపిస్తుంది 🌺 |