శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
804. పుష్కరా | ||
పుష్కర రూపిణి పుష్కరా అనగా త్రిశక్తి స్వరూపములో మహా సరస్వతి లక్షణముతో వున్న స్వరూపమే పుష్కరా . పుష్కర అనగా కమలము, నిర్ధిత కాలమును తెలుపుట, అని మరియుక్క అర్ధం. పుష్కర స్వరూపములో వున్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరకాలము., మనిషి యొక్క గ్రహ చారములను తెలుపుటకు ఒక దిక్సూచి. మనసా, వాచా, కర్మల ప్రాయశ్చితమునకు పుష్కర నదీ స్నానము శ్రేష్ఠము🌺 |