శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
881. యజమాన స్వరూపిణి | ||
ఆత్మ స్వరూపిణి. యజ్ఞము చేయించే వారు యజమాని. "నాహం కర్తా హరిః కర్తా" అన్న ఆలోచన కలిగి ఉన్న వారిలో, పరమేశ్వరి ఆత్మ స్వరూపిణిగా ఉండి యజ్ఞము జరిపిస్తుంది. యజమాని ఆత్మ స్వరూపములో ఉన్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 ధర్మబద్ధముగా చేసే యజ్ఞములో పాల్గొనాలి, వాటిని ప్రోత్సహించాలి🌺 |