శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
1000. లలితాంబికా | ||
సుకుమార సౌందర్యవతియైన తల్లి. మూల ప్రకృతియైన పరమాత్మ స్వరూపిణి. ఈ తల్లియే చరాచర జగత్తుకు మూల కారణము. నిత్య సంతోషాన్ని ప్రసాదించే లలితాంబికకు నమస్కారము. 🙏 🌺 నిత్యము లలితా సహస్ర నామ పారాయణం చేద్ధాము. అమ్మ కృపను పొందుదాము. 🌺 ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః 🌺ఇవే లలితా దేవి యొక్క విశేష సహస్ర నామములు 🌺 ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీ లలితా రహస్యనామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః సమాప్తః ఇది బ్రహ్మాండపురాణములో, ఉత్తరఖండంలో శ్రీ హయగ్రీవ అగస్త్యుల సంభాషణలో, శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనము ధ్వితీయో ధ్యాయము సమాప్తము. 🙏 |