శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
917. చైతన్యకుసుమప్రియా | ||
అత్మార్పణ చేయు వారి యందు ప్రీతి కలది. చైతన్యపూరితమైన ఆత్మని పుష్పముగా సమర్పించు వారి పట్ల ప్రీతితో ఉన్నది. సంపూర్ణమైన భక్తి భావనతో పరమేశ్వరిని పూజించిన వారికి ఆత్మ జ్ఞానము ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము.🙏 🌺 మనిషికి మనిషి సహాయ పడటము పరమేశ్వరికి చాలా ప్రీతి. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సూక్తిని పాటిద్దాం🌺 |