శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
936. విశాలాక్షీ | ||
విశాలమైన నేత్రములతో ఉన్నది. నేత్రములకు పరిమితము కాకుండా, దివ్యమైన దృష్టి కలిగి ఉన్నది. భూత, భవిష్యత్, వర్తమాన కాల దృష్టి కలిగి ఉన్న పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 భూత, భవిష్యత్, వర్తమానములు అన్న కాల ప్రమేయము లేకుండా అన్ని వేళలా పరమేశ్వరి యొక్క దృష్టి మన మీద ఉండాలి అని వేడుకుందాము🌺 |