శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
957. ధన్యా | ||
చింతాస్థితి భక్తుల యొక్క చింతా స్వరూపము. పరమేశ్వరి తనను ఆశ్రయించిన భక్తులకు, కాలాను సారంగా భక్తి, జ్ఞాన, వైరాగ్య , కృతార్ధ చింతను కలిగిస్తుంది. భక్తుడే భగవంతుడైన స్థితియే ధన్యా.🙏 🌺 ప్రతి మనిషి పరోపకారం అన్న సిధ్ధాంతాన్ని పాటించడము వల్ల ఈ జన్మకు సార్థకత లభిస్తుంది 🌺 |