శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
970. సువాసినీ | ||
నిత్య సుమంగళి నుదిటిన కుంకుమ, కళ్ళకు కాటుక, మెడలో మంగసూత్రము, నల్ల పూసలు, కాళ్ళకి పసుపు, మెట్టెలు, తలలో పూలు, చేతికి గాజులు ,... ఇత్యాది అలంకారము చేసుకున్న స్త్రీ సువాసినిగా గుర్తించబడుతుంది. నిత్య సుమంగళి , నిత్య సువాసినియైన పార్వతీదేవికి నమస్కారము. 🙏 🌺 ప్రతి స్త్రీమూర్తిలో లలితా దేవి కొలువై ఉన్నది. 🌺 |