శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
996. శ్రీచక్రరాజనిలయా | ||
శ్రీ చక్రములో కొలువై ఉన్నది. శ్రీ చక్ర మేరువును చక్రరాజము అందురు. అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి కొలువై ఉన్నది. కామేశ్వరుడితో కూడి ఉన్న కామేశ్వరి అన్ని శ్రీ చక్ర ప్రస్థానములలో కొలువై ఉన్నారు. శ్రీ చక్రమే వారి గృహము. శ్రీచక్ర త్రికోణ మధ్యస్థ బిందువులో కొలువై ఉన్న రాజ రాజేశ్వరీ దేవికి నమస్కారము 🙏 🌺 మనిషి యొక్క శరీరమే శ్రీ చక్రము. ధర్మార్థకామ మోక్షములను త్రికరణ శుద్ధి తో పాటిస్తే, పరమేశ్వరి మరెక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది 🌺 |