శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
913. స్వభావమధురా | ||
మధుర స్వభావము కలిగి ఉన్నది. స్వ అనగా తన నామస్మరణ నిత్యము భావన తెలుసుకొని చేయు వారికి మధు అనగా అమృతము వంటి జీవన్ముక్తిని కలిగిస్తుంది. అమృత కాంతిని ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 ఏదుటి వారితో వారి మనసు తెలుసుకొని ప్రవర్తించడం, పరమేశ్వరి యొక్క స్వభావము కలిగి ఉండటమే. ఆ బాట లో నడవటానికి ప్రయత్నము చేద్దాము. 🌺 |