శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
995. సర్వా నుల్లంఘ్య శాసనా | ||
అమ్మ మాటే శాసనం గ్రహ దోషాలను, దుష్ట శక్తులను శాసించగల శక్తి స్వరూపిణి. సర్వ శాసనాలను ఉల్లంఘించ గల ఎకైక శక్తి స్వరూపిణీ శ్రీ లలితా పరమేశ్వరి. ధర్మాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష విధిస్తుంది. తనను భక్తితో ఆశ్రయించి,ధర్మాచరణ చేయు వారి గ్రహ దోషాలను తొలగిస్తుంది. తన మాటే శాసనమైన పరా బట్టారికకు నమస్కారము 🙏 🌺 సనాతన ధర్మము అన్నది వేద వాజ్ఞ్మయము. ధర్మాన్ని అనుసరించడం వల్ల దేవి కృపకు పాత్రులము కాగలము🌺 |