శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
976. త్రిపురాంబికా | ||
ముగ్గురమ్మల మూలపుటమ్మ. మహాదేవి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపము. మూడు శక్తుల అధిదేవతయే త్రిపురాంబికా. లలితా పరాభట్టారికా స్వరూప త్రిపురాంబికామాతకు నమస్కారము 🙏 🌺"అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా బెద్దమ్మ, సురారులమ్మ , కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మ , మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ, కవిత్వ ,పటుత్వ, సంపదల్" అన్న పోతన వారి ఈ పద్యమును నిరంతరము పఠిస్తె, సకల అభీష్టములను తీరుతాయి 🌺 . |