శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
990. అభ్యాసాతిశయజ్ఞాతా | ||
నిరంతరము అభ్యాసనతో జ్ఞానమును పొందగలము. అహర్నిశలు దేవి యొక్క నామ జపము అభ్యాసన చేయుట వల్ల జ్ఞానము కలిగి, పరమేశ్వరి కృప లభించును. ధ్యానము, గానము, పఠనము, శ్రవణము ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺 విద్యను, విశేషముగా అభ్యాసన చేస్తూ ఉంటేనే, ఫలితము పొందగలము. తద్వారా నలుగురిలో గుర్తింపు లభిస్తుంది🌺 |