శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
915. ధీరసమర్చితా | ||
ధీర స్వభావము కల వారిచే పూజలు స్వీకరిస్తుంది. నైపుణ్యము, ధైర్య సాహసాలతో, ఓర్పుతో ఉన్న వారు ధీర స్వభావము గల వారు. పరమేశ్వరి పూజ చేసే వారికి ఈ స్వభావము అలవడుతుంది . పరమేశ్వరి యొక్క ధైర్య స్వభావము కలిగి వున్న వారికి నమస్కారము 🙏 🌺 శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. అమ్మ కృపకు పాత్రులమౌదాము🌺 |