శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
978. త్రిపురాశ్రీవశంకరీ | ||
త్రిపురాశ్రీ దేవత వశమౌతుంది. శ్రీ చక్రము యొక్క ఐదవ ఆవరణలో త్రిపురాశ్రీ అధిదేవత. త్రిపురాశ్రీ అన్న దేవత ఆరాధనతో, దేవి వశమౌతుంది. సాధకుడికి ఆత్మానందాన్ని కలిగిస్తుంది🙏 🌺 మనిషి యొక్క శరీరమే శ్రీచక్రము . అందున ఈ నామ జపము వల్ల మన జాతక చక్రములోని ఐదవ ఇంట, అభివృధ్ధి, ధన ప్రాప్తి, మానసిక ప్రశాంతత కలిగిస్తుంది 🌺 |